బ్యాంకాక్ సమీపంలోని చటుచక్ జిల్లా ఛోమ్ ఫోన్ లో అత్యంత రద్దీగా ఉండే రాంగ్ బీర్ నా లాట్ ఫ్రావో పబ్‌లో సంభవించిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రాణాలు సజీవదహనం అయ్యారు. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు.అగ్నికీలలు చుట్టుముట్టడంతో తమ ప్రాణాలు కాపాడుకోవడానికి లోపల ఉన్న చాలా మంది పబ్‌లోని బాత్‌రూమ్‌లలోకి వెళ్లి తలదాచుకున్నారు. అదే వారి ప్రాణాలను తీసింది. దట్టమైన పొగ, విషవాయువులు కమ్ముకోవడంతో ఊపిరాడక వారంతా బాత్‌రూమ్‌లలోనే శ్వాస విడిచారు.