సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ల వివాహం గురించి సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ తమిళ సినిమా వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. నవంబర్ రెండో వారంలో ఈ క్రేజీ జోడీ వివాహ బంధంతో ఒకటి కానున్నట్లు సమాచారం. ఈ క్రేజీ వెడ్డింగ్ రూమర్స్‌పై మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.