గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియా లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో గల్ఫ్ దేశాలకు ఇరాన్ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. తమ బద్ధశత్రువైన అమెరికా సైనిక కార్యకలాపాలకు, మిలిటరీ బేస్‌లకు ఏ రకమైన ఆశ్రయం లేదా మద్దతు ఇచ్చినా.. సదరు దేశాలను ఇరాన్ శత్రు దేశాలుగా పరిగణిస్తుందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్పష్టం చేసింది. అమెరికా సైన్యానికి సహకరించడాన్ని నేరుగా “ఇరాన్‌పై యుద్ధం ప్రకటన” గానే తాము భావిస్తామని పేర్కొంది. లాజిస్టిక్,ఇంటెలిజెన్స్ సహాయం చేసినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది.

