షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన కేసు నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని కొత్తూరు వద్ద రైల్వే పట్టాలపై స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ దైవాలగూడలో పోక్సో కేసు పెట్టారని ఆరుగురిని హత్య చేశాడు రాజ్‌కుమారు. మూడు రోజుల తర్వాత ఆరుగురిని హత్య చేసిన హంతకుడు రాజ్‌కుమార్ తన మేనమామ ఊరిలో చనిపోయి కనిపించాడు. కొత్తూరు మండలం పంజర్లలో డెడ్‌బాడీ, పక్కనే పాయిజన్ బాటిల్ కూడా ఉండటంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని తేల్చారు.