ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు.ముంబయిలోని కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని సోమవారం సాయంత్రం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులతోనూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.