షాబాద్ ఆరుగురి హత్యల కేసులో నిందితుడు ఫోన్‌లో అత్యంత షాకింగ్ వీడియో ఒకటి లభ్యమైంది. ఒక అమ్మాయిని గుడ్డిగా నమ్మి సర్వస్వం కోల్పోయానని, తన దగ్గర నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి, తనను పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసి, చివరికి కన్న పిల్లలకు చేతిలో పైసా, ఉండడానికి కాస్త భూమి కూడా లేకుండా రోడ్డున పడేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపాలని సదరు వ్యక్తులు కుట్రలు పన్నారని, భరించలేకే మారణహోమానికి, ఆపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు.