పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బంగాళాఖాతంలో వేటకు వెళ్లిన పడవ మునిగి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. మృతులను ఒడిశా, పశ్చిమబెంగాల్ కు చెందిన వారిగా గుర్తించారు… జులై 4 తర్వాత ఆ బోటులో ఉన్నవారితో సంబంధాలు తెగిపోయినట్లు సహచర మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక మత్స్యకారులతో కలిసి గాలింపు చేపట్టిన పోలీసులు.. అతికష్టం మీద పడవను ఒడ్డుకు తీసుకొచ్చి పరిశీలించగా.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తొమ్మిది మృతదేహాలు బయపడ్డాయి. మిగతా ఆరుగురి కోసం గాలిస్తున్నారు.