ఇరాన్‌కు మద్దతుగా రష్యా నేరుగా రంగంలోకి దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాకు చెందిన Tu-214PU అనేది టుపోలెవ్ విమాన శ్రేణిలో అత్యంత అధునాతన గగనతల కమాండ్ పోస్ట్ వెర్షన్. దీనిని రక్షణ రంగ నిపుణులు ‘డూమ్స్‌డే ప్లేన్’ (యుగాంతపు విమానం) అని కూడా పిలుస్తారు. తీవ్రమైన అణుయుద్ధం లేదా అంతర్జాతీయ అత్యవసర
సంక్షోభ సమయాల్లో దేశ అత్యున్నత నాయకత్వం మరియు వ్యూహాత్మక వైమానిక దళం గాల్లో ప్రయాణిస్తూనే.. క్షిపణి ప్రయోగాలు, సైనిక బలగాల నియంత్రణను పర్యవేక్షించేలా ఈ విమానాన్ని రూపొందించారు.