హోర్ముజ్ జలసంధిలో సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న GFS Galaxy వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి పాల్పడింది. దాడి అనంతరం నౌకలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో నౌకలో మొత్తం 11 మంది భారతీయులు ఉండగా.. 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఓ భారతీయుడు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం ఒమన్ అధికారులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. అనుమతిలేని మార్గంలో నౌక ప్రయాణిస్తోందన్న కారణంతోనే దాడి చేపట్టామని ఇరాన్ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.