వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకుల మృతదేహాలను తక్షణమే స్వస్థలాలకు తరలించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వియత్నాం ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సేవలు, సహాయక చర్యలపై ఆదివారం ఆయన ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీరికి సంబంధించిన విమాన టిక్కెట్ల ఖర్చులను సదరు మొబైల్ కంపెనీయే భరించింది.