కూటమి ప్రభుత్వంలో ఎరువులు వస్తాయో రాఓ అనే ఆందోళనతో ఆర్బికేల్లో ఉన్న ఎరువులు కొనుగోలు చేసేందుకు శ్రీకాకుళం జిల్లా లవునిపల్లిలో రైతులంతా చేరుకున్నారు. ఈ ఆర్ బి కే లో కేవలం 200 బస్తాలు మాత్రమే ఉండడం, ఒక్కో రైతుకి కేవలం ఒక బస్తా ఇస్తామని అధికారులు చెప్పడంతో రైతులు తమకు యూరియా దొరుకుతుందో లేదో అని రైతులు అధికంగా చేరుకోవడంతో అందులో చిక్కుకున్న పినకాన కాంతమ్మ (70) అస్వస్థతకు గురైంది, జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే కాంతమ్మ మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.