ఒంగోలు నగరంలో ఆదివారం మహిళా వైద్యులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించడంతో ఓ ఏఆర్ కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలులో జరుగుతున్న గైనకాలజిస్టుల రాష్ట్ర సదస్సుకు హాజరైన కొందరు మహిళా వైద్యులు, నగరంలోని ఒక కాఫీ షాప్ నకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో వారి కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డుపై వేగంతో దూసుకెళ్లిన ఈ కారు, సైకిల్ పై వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్ మరియదాసును బలంగా ఢీకొట్టింది. మరియదాసు అక్కడికక్కడే మృతి చెందారు.