నంద్యాల జిల్లాలో హనుమకొండ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు. డివైడర్ ను ఢీకొట్టడంతో బస్సు ఒక్కసారిగా ఊగిపోయి నిలిచిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లి ఉంటుందని భావిస్తున్నారు.