గత రాత్రి బస్సుల్లో తనిఖీకి కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ నాగశెట్టిహళ్లికి వెళ్లే బీఎంటీసీ బస్సు ఆయన ఎక్కారు. రెండు టిక్కెట్లు కావాలని మంత్రి రూ.100 నోటు ఇచ్చారు. మంత్రిని గుర్తించని కండక్టర్.. చిల్లర ఇవ్వాలని కోరాడు. తన వద్ద చిల్లర లేదని మంత్రి చెప్పగా తన వద్ద కూడా చిల్లర లేదని చెబుతూ చిల్లర ఇవ్వలేకపోతే బస్సు దిగాల్సిందేనని కండక్టర్ పట్టుబట్టాడు. దీంతో మంత్రి ఎలాంటి సమాధానం చెప్పకుండానే బస్సు దిగిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.