మిడిల్ ఈస్ట్ (పశ్చిమాసియా) ప్రాంతం మరోసారి రణరంగంగా మారింది.ప్రపంచ చమురు రవాణా మార్గమైన వ్యూహాత్మక ‘హర్మూజ్ జలసంధి’ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రత్యక్ష సైనిక పోరు మొదలైంది. ఇరాన్ రవాణా వ్యవస్థలు, కీలక వంతెనలపై అమెరికా వైమానిక దాడులకు తెగబడగా.. దానికి ప్రతీకారంగా ఇరాన్ సైన్యం కూడా గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల్లోని కీలక అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ ఆకస్మిక పరిణామాలతో గల్ఫ్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.