సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నాంపల్లి హజ్ హౌస్ లో హజ్ యాత్రికుల బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, యాత్రకు జెండా ఊపారు. తమకు హిందూ, ముస్లిం భేదాభిప్రాయం లేదని, హిందూ ముస్లిం భాయీ భాయీ అని వ్యాఖ్యానించారు. సంక్షేమంలో మైనారిటీల వాటాను వారికి అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగాలలో, సంక్షేమ పథకాలలో మైనారిటీలకు దక్కాల్సిన వాటాను వారికి అందిస్తున్నామన్న సీఎం.. విదేశీ విద్య విషయంలోనూ మైనారిటీలకు స్కాలర్షిప్ లు అందిస్తున్నామని స్పష్టం చేశారు.

