2027 నాటికి రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు ఉండాలనే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే ఆగస్టు 15 నాటికి 2.50 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని, డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లను సిద్ధం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2027 డిసెంబర్ నాటికి అదనంగా మరో 10 లక్షల ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.