loader

టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా బోణీ.. పాకిస్తాన్‌పై ఘన విజయం…

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీని భారత మహిళా జట్టు ఘనంగా మొదలెట్టింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది భారత జట్టు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. 171 పరుగుల లక్ష్యఛేదనలో 17 ఓవర్లలో 106 పరుగులకి ఆలౌట్ అయ్యింది పాకిస్తాన్ మహిళా జట్టు. వైస్ కెప్టెన్ స్మృతి, కెప్టెన్ […]

భారత్-పాక్ మధ్య మళ్లీ ‘నో హ్యాండ్ షేక్’

ఆదివారం ఎడ్జ్బస్టన్ వేదికగా జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టాస్ కోసం మైదానంలోకి వచ్చిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో చేతులు కలపలేదు. దీంతో ‘నో హ్యాండ్ షేక్’ విధానం మరోసారి చర్చనీయాంశమైంది. సాధారణంగా టాస్ అనంతరం ప్రత్యర్థి కెప్టెన్లు ఒకరితో ఒకరు చేతులు కలుపుతారు. కానీ ఈ మ్యాచ్ అలాంటి దృశ్యం కనిపించలేదు. ఇద్దరు కెప్టెన్లు మర్యాదపూర్వకంగా పలకరించుకున్నప్పటికీ, చేతులు మాత్రం కలపలేదు.

ఇది ప్రజాస్వామ్య విలువలు, భావప్రకటనా స్వేచ్ఛపై దాడి: వైఎస్ జగన్

చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్ష నేతల గళాన్ని నులిమేస్తోందని, ఈ ఏడాది ఆరంభంలో తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించారని, ఇప్పుడు అధికారిక వైఎస్సార్సీపీ ఫేస్ బుక్ పేజీని భారత్ లో అందుబాటులో లేకుండా చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో మా అధికారిక పేజీని వెంటనే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే న్యాయపోరాటం చేస్తాం” అని […]

పాక్‌తో మ్యాచ్‌.. చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్‌

మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ భారత్ తరఫున టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున ఇప్పటివరకు ఈ రికార్డు మిథాలీరాజ్ పేరిట ఉంది. మిథాలీరాజ్ 40.33 సగటుతో 726 పరుగులు సాధించింది. తాజాగా హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బౌండరీ కొట్టడం ద్వారా మిథాలీరాజ్ రికార్డును బద్దలుకొట్టి అగ్రస్థానంలో నిలిచింది. స్మృతి మంధాన 524 పరుగులతో మూడో […]

అన్నాడిఎంకెకు నటి గౌతమి రాజీనామా..

తమిళనాడులో AIADMK పార్టీకి చెందిన ప్రముఖ సినీ నటి గౌతమి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు తనకు అప్పగించిన పదవికీ ఆమె వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి ఆదివారంనాడు తన రాజీనామా లేఖను పంపారు. సినీరంగంలో విశేష గుర్తింపు పొందిన గౌతమి రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. బిజెపి ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తర్వాత ఏఐఏడీఎంకేలో చేరి, పార్టీ తరఫున వివిధ […]

సింగపూర్‌ చేరుకున్న సీఎం చంద్రబాబు.. తెలుగు ప్రజల ఘనస్వాగతం

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు అక్కడి తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. సీఎం అందరినీ పలకరించి వారితో ఫొటోలు దిగారు. పర్యటనలో భాగంగా ప్రపంచ నగరాల సదస్సు (వరల్డ్ సిటీస్ సమిట్)లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన

పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి నుంచే పల్నాడు జిల్లా కలెక్టర్ తో ఫోన్ ద్వారా ప్రమాద వివరాలు, సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా […]

‘నేను కూడా రోడ్డు మీదకు వస్తా’.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ వర్షాలు, వరద ముప్పు, ప్రకృతి విపత్తుల నిర్వహణపై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సచివాలయంలో అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షం పడే సమయంలో ఫీల్డ్ లో ఉండని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వర్షం సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు రోడ్ల పైన ఉండాల్సిందేనని.. అవసరం అయితే తాను కూడా రోడ్డు మీదకు […]

“అది నకిలీ వీడియో.. నా గొంతు కాదు” : షబ్బీర్ అలీ

“అది నకిలీ వీడియో, అది నా గొంతు కాదు..” అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ తేల్చి చెప్పారు. ఏఐసిసి నుంచి, పిసిసి నుంచి నోటీసు అందుకున్న షబ్బీర్ అలీ 24 గంటల లోపే పిసిసి క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించి, బలహీనపరిచేందుకు జరిగిన కుట్ర అని ఆయన ఆరోపించారు. తప్పుడు ఆడియో రికార్డులను పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలూ నమ్మవద్దని […]

వివాదంలో అయోధ్య రామమందిరం డొనేషన్స్ ..

ఉత్తరప్రదేశ్ లోని ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్య రామమందిరం ప్రాంగణంలోని డొనేషన్ బాక్సుల (హుండీల) లో భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల నగదు కొన్ని రోజులుగా క్రమబద్ధంగా మాయమవుతోందంటూ వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. SP అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, పవిత్రమైన రామాలయ విరాళాలలో అక్రమాలు జరగడం అత్యంత విచారకరమని మండిపడ్డారు. హుండీల నుంచి దాదాపు రూ. 7 కోట్ల విరాళాలు మాయమయ్యాయని నేతలు ఆరోపణలు చేస్తూ,దర్యాప్తు జరపాలని డిమాండ్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON