విశాఖపట్నంలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఏర్పాటునకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్ల మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో కాన్సర్ట్ల నిర్వహణ, కాన్సర్ట్‌లకు ప్రత్యేక విధానం ప్రతిపాదనకు రాష్ట్రమంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఎస్ఐపీబీ సిఫార్సులతో భారీ పెట్టుబడులకు ప్రోత్సాహకాలకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన సంస్థలకు భూకేటాయింపులకు అనుమతులు ఇచ్చింది.