కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒకసారి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వల్లే భారీ నష్టం జరిగిందని, అలాంటి పరిస్థితిలో మళ్లీ నీళ్లు నిల్వ చేయాలని కోరడం బాధ్యతారాహిత్యమన్నారు. అలా చేస్తే భద్రాచలం ప్రాంతానికి ముప్పు ఏర్పడుతుందని, గతంలో ఖమ్మం జిల్లాలో 44 గ్రామాలు వరదలతో తీవ్రంగా నష్టపోయాయని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని బీఆర్ఎస్‌ను హెచ్చరించారు. కేసీఆర్‌ను ఉద్దేశించి దొంగ సర్వేలు చేయించే ఏజెన్సీలను ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు.