అక్రమాస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయిన డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో సోదాల్లో భాగంగా ACB అధికారులు ఆయన డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో ఆయన ఓ ప్రముఖ టాలీవుడ్ హీరోకి రూ.3 కోట్లు అప్పు ఇచ్చినట్లు రాసుకున్నట్లు గుర్తించారు. ఈ హీరోతో పాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా డైరీలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ హీరోకు నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని అధికారులు భావిస్తున్నారని సమాచారం. హీరో ఎవరై ఉంటారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.