సుప్రీంకోర్టులో శుక్రవారం ఓ కేసు విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుడు వాదించడానికి కోర్ట్ హాల్ కు వచ్చాడు. వాదన వినిపించే క్రమంలో సదరు వ్యక్తి పూర్తిగా కంట్రోల్ తప్పాడు. ఏసీపీపై వెంటనే కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులనే ఆదేశించాడు. సదరు వ్యక్తి మాట్లాడుతూ సీజేఐపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. పేపర్లను గాల్లోకి విసిరేశాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ అతడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు లాయర్లు వెంటనే ఇద్దరు జడ్జిలను కోరారు.