loader

ప్రశ్న రావణ్ నివాసంలో ఏపీ పోలీసుల సోదాలు

యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై నమోదైన కేసుకు సంబంధించి ఏపీ పోలీసులు ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్ ప్పూర్ పట్టణంలోని నరేంద్ర నగర్ కాలనీలో ప్రశ్న రావణ్ నివాసం ఉంటున్నారు. గురువారం గన్నవరం పోలీసులు రావణ్ ఇంటికి వచ్చి విస్తృతంగా తనిఖీలు చేశారు. ఆయన సోషల్ మీడియా వ్యవహారాలు, కార్యకలాపాలపై రావణ్ భార్యను ప్రశ్నించారు. డిజిటల్ సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకునేందుకే ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఎట్టకేలకు సీఎం విజయ్ ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ పూర్తి..

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో దళపతి విజయ్ కోట్లాది మంది అభిమానుల ఏడు నెలల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ రిలీజ్ కు సెన్సార్ బోర్డు (CBFC) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ జన నాయగన్ చిత్రానికి ‘A’ (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ ఇచ్చింది. సెన్సార్ పూర్తయినందున, ఈ చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

షూ ఫ్యాక్ట‌రీలో ఘోర అగ్ని ప్ర‌మాదం.. 28 మంది మృతి!

 చైనాలోని ఓ షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 28 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. జియాంగ్ లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. షూ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఒక్కసారిగా అంతటా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 35 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

‘ఫౌజీ’ సినిమా సెట్‌లో నటుడ్ని కుట్టిన విష పురుగు.. సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్

రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా సెట్‌లో నటుడు రాజేష్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) డిమాండ్ చేసింది. రాజేష్ శర్మ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయనకు ఇంకా ప్రమాదం తొలగిపోలేదని AICWA వెల్లడించింది. తాజా మెడికల్ అప్‌డేట్ ప్రకారం ఈ ఘటన తీవ్రత మరింత ఆందోళనకరంగా మారింది. ఈ ఘటనపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని తెలంగాణ […]

గాఫ్‌పై సంచలన విజయం‌.. తొలిసారి వింబుల్డన్ ఫైనల్లో ముచోవా..!

 వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో కరోలినా ముచోవా సంచలన విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఏడో సీడ్ కొకో గాఫ్‌ను చిత్తు చేసిన ముచోవా తొలిసారి వింబుల్డన్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గురువారం హోరాహోరీగా  జరిగిన మ్యాచ్‌లో గాఫ్‌పై ఆధిపత్యం చెలాయించిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి.. నిర్ణయాత్మక మూడో సెట్‌లో గెలుపొందింది. దాంతో, మొదటిసారి ఆల్ ఇంగ్లండ్ క్లబ్ టోర్నీలో విజేతగా నిలవాలనుకున్న అమెరికా స్టార్ గాఫ్ కల చెదిరింది.

కీల‌క రైల్వే వంతెన‌పై అమెరికా దాడి.. ఇరాన్‌, చైనా, ర‌ష్యా దేశాల‌కు తీవ్ర న‌ష్టం..!

ఇరాన్, చైనా, రష్యా దేశాల మధ్య భూమార్గం ద్వారా జరిగే వ్యూహాత్మక వస్తు రవాణాకు కీలకంగా భావించే ఆక్ తఖే ఖాన్ రైల్వే బ్రిడ్జి పై అమెరికా వైమానిక దళం క్షిపణి దాడి చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని గొలిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ రైల్వే వంతెన చైనా-తుర్క్‌మెనిస్తాన్-ఇరాన్ రైల్వే కారిడార్‌లో అత్యంత కీలకమైన భాగం. ఇరాన్, రష్యా, చైనా దేశాలు ఆయుధాలు, ముడి చమురు, ఇతర సరుకుల రవాణాకు ఈ […]

శోభన్‌బాబు సతీమణి కన్నుమూత

దివంగత హీరో శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి మృతిచెందారు. ఆమె వయోభారంతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇక హీరో శోభన్‌బాబుతో శాంతకుమారి వివాహం 1958 సంవత్సరం మే 15న జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందిన శోభన్‌బాబు 2008లో గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటి నుంచి శాంతకుమారి కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోనే నివసిస్తున్నారు. శోభన్ బాబు సతీమణి శాంతకుమారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు […]

కాకినాడ తీరంలో బోటు ప్రమాదం

కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్ర తీరంలో ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎల్లయ్య పేట గ్రామానికి చెందిన ఎరుపల్లి కోటేశ్, ఎరుపల్లి ప్రసాద్ అనే ఇద్దరు మత్స్యకారులు(జాలర్లు) తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమందితో కలిసి సముద్రం లో సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు చేపల వేటకు వీరు వెళ్లారు. అక్కడ భోజనం వండుకునేందుకు బోటులో గ్యాస్ స్టవ్ ఆన్ చేయగా, ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా మంటలు చెలరేగి, పడవ మొత్తానికి వ్యాప్తి చెందాయి.వేరే బోటులో […]

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు

పోక్సో కేసులో అరెస్టు అయిన బండి సాయిభగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయోద్దని, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మే 8వ తేదీన పోక్సో కేసు నమోదు కావడంతో పరారయ్యాడు. సుచిత్రకు చెందిన మహిళ తన కూతురిపై సాయి భగీరథ్ లైంగికంగా హింసించాడన్న ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

ప్రధాని మోదీకి ఆస్ట్రేలియా రిటర్న్ గిఫ్ట్: ఒక్కో విగ్రహానికి ఒక్కో ప్రాచీన చరిత్ర

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్నారు. ఈ పర్యటన నేపథ్యంలో.. ప్రధాని మోదీకి ఆస్ట్రేలియా కొన్ని రిటర్న్ గిఫ్ట్ లను అందించింది. భారత్ కు చెందిన అపురూపమైన చారిత్రక విగ్రహాలు, పూజా సామాగ్రిని వెనక్కి ఇచ్చేసిందా దేశం. ఇందులో భద్రకాళి అమ్మవారి రూపంతో కూడిన లోహపు త్రిశూలం, పవిత్ర రాతి నంది విగ్రహం, షణ్ముఖ కార్తికేయుడి రాతి విగ్రహం ఉన్నాయి. ఈ కళాఖండాలు చోళులు, విజయనగర రాజుల కాలం నాటివి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON