చైనాలోని ఓ షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 28 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. జియాంగ్ లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. షూ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఒక్కసారిగా అంతటా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 35 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.