రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా సెట్‌లో నటుడు రాజేష్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) డిమాండ్ చేసింది. రాజేష్ శర్మ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయనకు ఇంకా ప్రమాదం తొలగిపోలేదని AICWA వెల్లడించింది. తాజా మెడికల్ అప్‌డేట్ ప్రకారం ఈ ఘటన తీవ్రత మరింత ఆందోళనకరంగా మారింది. ఈ ఘటనపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని AICWA కోరింది.