దివంగత హీరో శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి మృతిచెందారు. ఆమె వయోభారంతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇక హీరో శోభన్‌బాబుతో శాంతకుమారి వివాహం 1958 సంవత్సరం మే 15న జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందిన శోభన్‌బాబు 2008లో గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటి నుంచి శాంతకుమారి కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోనే నివసిస్తున్నారు. శోభన్ బాబు సతీమణి శాంతకుమారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తమ సంతాపాన్ని తెలియజేశారు