ఆంధప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు కాపులు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి కాలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ తెలిపారు.ఏపీ విభజన తర్వాత కూడా రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలకు రొటేషన్ మార్గంలో సీఎం పదవి చేతులు మారుతూ వస్తోంది. జగన్, చంద్రబాబు కాపులను ముఖ్యమంత్రిగా అంగీకరించరని, వారు లేదా వారి వారసులను మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసుకుంటారని, కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే, ముఖ్యమంత్రి అవుతారని చింతామోహన్ పేర్కొన్నారు.