టైప్-1, అడ్వాన్స్డ్ టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవడానికి రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇకపై ప్రతిరోజూ సూదితో గుచ్చుకోవాల్సిన అవసరం లేకుండా.. వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే సరికొత్త ఇన్సులిన్ అవిక్లీని నోవో నార్డిస్క్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ఏడాదికి తీసుకోవాల్సిన ఇంజెక్షన్ల సంఖ్య 365 నుండి కేవలం 52 కి పడిపోతుంది.