ేరళలో అత్యంత రద్దీగా ఉండే కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. 100 వత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఓ క్లాక్ టవర్ హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఆ క్షణంలో ప్లాట్‌ఫామ్ ఖాళీగా ఉండటం వల్ల ప్రమాదం తృటిలో తప్పిందని రైల్వే పోలీస్ అధికారులు వెల్లడించారు. శిథిలావస్థకు చేరిన ఈ చారిత్రక క్లాక్ టవర్ ను కూల్చివేయాలని కొద్దిరోజుల కిందటే రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి మార్కింగ్ కూడా చేశారు.