నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 26 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడంతో గురుకుల సిబ్బంది విద్యార్థులను చికిత్స నిమిత్తం అచ్చంపేట దవాకాఖనకు తరలించారు. కాగా, గురుకులంలో సిబ్బంది తాగునీరు కూడా ఇవ్వడం లేదని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.