మహారాష్ట్రలో భారీగా కురిసిన వర్షాలకు కాలువలు, వాగుల నుంచి గ్యాస్ సిలిండర్లు కొట్టుకోస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో సిలిండర్లను చూసిన జనాలు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. రాయగడ్ జిల్లా చావణే ప్రాంతంలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ప్లాంట్ ఆవరణలోకి ఒక్కసారిగా వరద నీరు అత్యంత వేగంగా లోపలికి రావడంతో అక్కడ నిల్వ ఉంచిన సుమారు 1,200 ఖాళీ గ్యాస్ సిలిండర్లు ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయాయి.