బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న సర్దేవర్ అమృత (17) ఆత్మహత్యకు పాల్పడింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని బాన్సువాడ పట్టణంలోని ఎస్సి బాలికల వసతి గృహంలో ఉంటూ విద్య అభ్యసిస్తుంది. బుధవారం ఉదయం విద్యార్థులు అందరూ కళాశాలకు వెళ్లిన అనంతరం వసతి గృహంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు.