పుణ్య క్షేత్రం బద్రీనాథ్‌లో చందాల మాయం వివాదంలో ఆలయ మాజీ ఉద్యోగిపై అధికారులు కేసు దాఖలు చేశారు. శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ (బికెటిఎస్) ఛైర్మన్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ప్రమోద్ నౌతియాల్‌ను పలు దఫాలుగా విచారించిన తరువాత ఇప్పుడు కేసు దాఖలు చేసినట్లు పోలీస వర్గాలు బుధవారం తెలిపాయి. ఆయన హయాంలో పెద్ద ఎత్తున చందాల అక్రమాలు జరిగాయని, తప్పుడు లెక్కలు చూపారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీనితో ముందుగా ఆయనను సస్పెండ్ చేశారు.