నంద్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తాను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు గంగుల నాని అహోబిలానికి రావాలని అఖిలప్రియ సవాల్ విసిరారు. అయితే నాని అక్కడకు వెళ్లలేదు. ఈ క్రమంలోనే అహోబిలం నుంచి ఆళ్లగడ్డకు అఖిలప్రియ బయలుదేరడం స్థానికంగా హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డకు వస్తున్నారనే సమాచారం రావడంతో ఆమె అనుచరులు, గంగుల నాని వర్గీయులు అప్రమత్తమయ్యారు. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.