దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బుధవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షం కారణంగా వాయువ్య ఢిల్లీలోని రోహిణి సెక్టార్-16 పరిధిలోని ఒక ఎంసీడీ (MCD) పాఠశాల దరిదాపుల్లో నాలుగంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ దారుణ ప్రమాదంలో పలువురు నలిగిపోయి, శిథిలాల క్రింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భయపడుతున్నారు. కూలిపోయిన ఆ బిల్డింగ్ చాలా కాలం నాటి పురాతనమైనదని, ప్రమాదం జరగడానికి ముందు అక్కడ కొన్ని నిర్మాణ పనులు కూడా సాగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.