పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పులు మళ్లీ ఆ ప్రాంత భద్రతా పరిస్థితిపై ఆందోళన పెంచాయి. బుధవారం జరిగిన ఈ ఘటనలో కనీసం 11 మంది భద్రతా సిబ్బంది, 19 మంది ఉగ్రవాదులు మరణించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. నైరుతి పాకిస్థాన్‌లోని కీలక జాతీయ రహదారిని ఉగ్రవాదులు దిగ్బంధించడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ చర్య సమయంలో ఇరువైపులా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆపరేషన్‌లో పలువురు ఉగ్రవాదులు గాయపడినట్లు కూడా సమాచారం.