టర్కీలో జరిగిన నాటో సమావేశం సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్‌తో ఉన్న అవగాహన ఒప్పందం ఇక అమల్లో లేదని స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లలో చమురు సరఫరాపై భయాందోళనలను మరింత పెంచాయి. చమురు సరఫరాపై ఆందోళనలు ఇలాగే కొనసాగితే బ్రెంట్ క్రూడ్ ధర త్వరలోనే బ్యారెల్‌కు 80 డాలర్ల స్థాయిని తాకే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.