అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ – అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ముగిసిందని తెలిపారు. ఇరాన్‌తో భవిష్యత్తులో ఎలాంటి చర్చలు ఉండబోవని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాకుండా గత రాత్రి తాము ఇరాన్‌పై శక్తివంతమైన దాడి చేశామని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌లోని వారు ప్రమాదకరమైన వ్యక్తులు అని విమర్శించారు. వారి (ఇరాన్ నాయకుల) మానసిక స్థితి సరిగా లేదని… వారిలో ఏదో లోపం ఉందని అన్నారు. ఇరాన్‌తో చర్చలు సమయం వృథా అని ట్రంప్ పేర్కొన్నారు.