తనకు కేవలం మూడు నెలల పాటు ఇరిగేషన్ శాఖ బాధ్యతలను అప్పగించాలని, నీళ్లు ఎలా తీసుకురావాలో ప్రాక్టికల్ గా చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ సవాల్ విసిరారు. ఒకవేళ తాను చెప్పినట్లు నీళ్లు తీసుకురాలేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందోననే కుళ్లుతో, నీళ్లు ఎత్తకుండా రేవంత్ రైతుల గొంతు కోస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.