తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి నీటిని కిందకి వదులుతున్నాడన్నారు. సాధారణంగా దేవాదుల మోటర్లు 71 మీటర్ల నీళ్లు ఉంటే పనిచేస్తాయి, కానీ ఇప్పుడు 75 మీటర్ల నీళ్లు ఉన్నాయి. అంటే నీళ్లు ఉండి కూడా కావాలని ఎత్తిపోయడంలేదని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టులో సగానికి పైగా మోటార్లు అసలు ఆన్ చేయలేదు.మీ నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 80% చెరువులు ఎండిపోయి ఉన్నాయన్నారు.