ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్ సెట్స్‌లో రాజేష్ శర్మ అకస్మాత్తుగా ఒక పురుగు ఆయన కుడికాలి పాదంపై కుట్టింది. శరీరంలోకి చేరిన విష ప్రభావం వల్ల ఫ్లైట్‌లోనే అమాంతం షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి. విషపురుగు కుట్టిన కారణంగా ఆయన పాదం నుంచి మోకాలి వరకు అత్యంత వేగంగా ఇన్‌ఫెక్షన్ పాకిపోయినట్లు వైద్యులు గుర్తించారు. శ్వాస తీసుకోవడం కూడా విపరీతంగా కష్టమవడంతో కలకత్తాలో ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ICUలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.