ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబై చికిత్స కోసం శుక్రవారం పయనమవుతున్నారు. గత కొంతకాలంగా ఆయన రెండు భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. రొటేటర్ కఫ్ గాయం వల్ల భుజాల కండరాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని సమాచారం. నిరంతర ప్రజాసేవలో బిజీగా ఉండటం వల్ల చికిత్సను వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు వైద్యుల సూచన మేరకు ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఇటీవల ముంబై ఆసుపత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు.