యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై నమోదైన కేసుకు సంబంధించి ఏపీ పోలీసులు ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్ ప్పూర్ పట్టణంలోని నరేంద్ర నగర్ కాలనీలో ప్రశ్న రావణ్ నివాసం ఉంటున్నారు. గురువారం గన్నవరం పోలీసులు రావణ్ ఇంటికి వచ్చి విస్తృతంగా తనిఖీలు చేశారు. ఆయన సోషల్ మీడియా వ్యవహారాలు, కార్యకలాపాలపై రావణ్ భార్యను ప్రశ్నించారు. డిజిటల్ సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకునేందుకే ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.