loader

భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి – ఇండోనేషియా ప్రెసిడెంట్

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత గొప్ప మరియు శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని, దాని అద్భుతమైన ప్రస్థానం నుండి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశ ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో కొనియాడారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఇండోనేషియాలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక ప్రవాస భారతీయుల (డయాస్పోరా) ప్రతిష్టాత్మక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. భారతదేశం సాధిస్తున్న సాంకేతిక, ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలకు ఒక దిక్సూచిలా […]

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ – సీఎం రేవంత్

ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై మునుపెన్నడూ లేనంతగా నిప్పులు చెరిగారు. నీటిపారుదల శాఖ నివేదికలు, ఆధారాలను ప్రస్తావిస్తూ.. కాళేశ్వరం పేరుతో చారిత్రాత్మక విధ్వంసానికి మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే ప్రత్యక్ష బాధ్యులని, ప్రజల సొమ్మును దోచుకున్న వారిని ఆర్థిక ఉగ్రవాదులు అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 11,670 కోట్లు ఖర్చు చేశాక.. కమిషన్ల కక్కుర్తి […]

కాళేశ్వరంపై అసెంబ్లీ జాయింట్ సెషన్‌కు సీఎం రేవంత్ సవాల్

కేసీఆర్ ఇసుకపై ఇసుక మేడల్లా బ్యారేజీలు కట్టారు,తన మేదస్సుతోనే కాళేశ్వరాన్ని డిజైన్ చేశానని కేసీఆర్ స్వయంగా డబ్బా కొట్టుకున్నారు. కాళేశ్వరం విధ్వంసంపై చర్చించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. చర్చకు రమ్మంటే మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లను పంపిస్తున్నారు. కేసీఆర్ కోరుకున్న రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం సిద్ధం. స్పీకర్‌కు లేఖ రాసి తేదీ ఖరారు చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి […]

జలపాతంలో చిక్కుకున్న ఏపీ స్టూడెంట్స్..

ఏపీకి చెందిన ఇద్దరు కాలేజీ విద్యార్థులు కర్ణాటకలోని కొడగు జిల్లాలోని మల్లాళ్లి జలపాతంలో చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి ఆపరేషన్ సురక్షితంగా రక్షించారు. గణేష్, సంతోష్ స్నేహితులతో బారికేడ్లను దాటి వారు నీటిలోకి దిగారు. అదే సమయంలో ఎగువన ఉన్న పవర్ ప్లాంట్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. ఆ ఇద్దరు యువకులు దాదాపు గంటకుపైగా నీటి మధ్యలో బండరాయిని పట్టుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడారు.

కాళేశ్వరం వెన్నుపూస విరిగింది: సీఎం రేవంత్

కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ వెన్నుపూస లాంటిదని.. అదే విరిగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్లానింగ్, డిజైన్, ఆపరేషన్స్ మొత్తం లోపాలే ఉన్నాయని పేర్కొన్నారు. మేడిగడ్డ నిర్మించిన ప్రాంతమంతా ఇసుకతో నిండిపోయి ఉందని, అక్కడ బ్యారేజీలు కడితే నిలవవన్నారు. అదే విషయాన్ని ఇంజినీర్లు చెప్పినా కేసీఆర్ వినిపించుకోకుండా కట్టేశారన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో ఎట్టి పరిస్థితుల్లో నీరు నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలా చేస్తే, కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోతుందన్నారు.

చాట్‌ జీపీటీ సేవల్లో అంతరాయం.. స్పందించిన కంపెనీ

ఓపెన్ఏఐకి చెందిన చాటిజీపీటీ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. ఇమేజ్ జనరేషన్తో పాటు ఇతర సర్వీస్ ల్లోనూ సమస్య తలెత్తింది. ఇందుకు సంబంధించిన పోస్టులను యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనిపై ఓపెన్ఏఐ స్పందించింది. తమ సేవల్లో సమస్య ఏర్పడిందని, పరిష్కారానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని పేర్కొంది. అయితే, దీనిపై తమ ఇంజినీరింగ్ బృందం పనిచేస్తోందని, ఇప్పటికే చాటే జీపీటీ సేవలు పునురుద్ధరించినట్లు పేర్కొంది. ఇతర సర్వీస్లను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది.

మెటాకు బిగ్ షాక్.. ఏకంగా రూ.120 లక్షల కోట్ల జరిమానా ???

పిల్లలు, టీనేజర్ల సోషల్ మీడియా వినియోగంపై అమెరికాలో మెటా మరో పెద్ద న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల రూపకల్పన పిల్లలను ఎక్కువసేపు యాప్‌లలోనే ఉంచేలా ఉందని ఆరోపిస్తూ నాలుగు అమెరికా రాష్ట్రాలు భారీ జరిమానా కోరాయి. ఈ డిమాండ్ మొత్తం 1.4 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండటంతో కేసు ప్రపంచ టెక్ రంగం దృష్టిని ఆకర్షించింది. కాలిఫోర్నియా, కొలరాడో, కెంటుకీ, న్యూజెర్సీ రాష్ట్రాలు దాఖలు చేసిన వ్యాజ్యంలో ఎండ్‌లెస్ ఫీడ్, నోటిఫికేషన్లు, లైక్‌లు, పిల్లల దృష్టిని నిలిపివేయడానికి […]

కొత్తగా ల్యాండ్‌పూలింగ్‌.. రైతులకు రుణమాఫీ!

సీఆర్డీఏ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 జూన్ నుంచి భూములిచ్చే వారికి రూ.40వేల కౌలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భూములు ఇచ్చినప్పటి నుంచి 10ఏళ్లపాటు ఇది అమలు కానుంది. గ్రామకంఠాల్లో భూమి కోల్పోతున్న వారికి ఏటా రూ.10వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా పూలింగ్ జరిగే గ్రామాల రైతులకు ుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 6లోగా రుణం తీసుకున్న వారికి ఈ మాఫీ అమలు అవుతుంది. →

దొరకని మత్స్యకారుల ఆచూకీ.. ముగిసిన సెర్చ్ ఆపరేషన్

ఆంధ్రప్రదేశ్ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్,   ఇండియన్ నేవీ, ఏపీ మెరైన్ పోలీసులు  సముద్రంతో పాటు   తీర ప్రాంతంలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో అత్యాధునిక పరికరాలు, పడవలు, నౌకలు, హెలికాప్టర్ల సహాయంతో మత్స్యకారుల కోసం గాలించినా ఆచూకీ లభించలేదు.   ప్రస్తుతానికి సెర్చ్ ఆపరేషన్ అధికారులు ముగించినట్లు ప్రకటించారు. నివేదికను అధికారులు త్రిసభ్య కమిటీకి సమర్పించనున్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించే అవకాశాలున్నాయి.

ఏపీలో రూ.9,076.11 కోట్ల 11 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ లో 11 ప్రాజెక్టులకు సంబంధించి రూ.9,076.11 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 19వ ఎస్ఐపీబీ సమావేశంలో ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.రైతు కుటుంబాలు ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేలా పారిశ్రామికీకరణకు కృషి చేయాలని సూచించారు. ఇథనాల్ ప్రాజెక్టులు ఏర్పాటయ్యేలా ప్రోత్సాహం అందించాలని సూచించారు.100 టూరిస్ట్ స్పాట్‌ల దగ్గర ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేసి పర్యాటక రంగం నుంచి జీఎస్‌డీపీకి వాటా పెరిగేలా చూడాలి.’ అని ముఖ్యమంత్రి చెప్పారు.సోలార్ సెల్స్ తయారీ పరిశ్రమలను ఆహ్వానించాలని అధికారులకు సీఎం స్పష్టం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON