కేసీఆర్ ఇసుకపై ఇసుక మేడల్లా బ్యారేజీలు కట్టారు,తన మేదస్సుతోనే కాళేశ్వరాన్ని డిజైన్ చేశానని కేసీఆర్ స్వయంగా డబ్బా కొట్టుకున్నారు. కాళేశ్వరం విధ్వంసంపై చర్చించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. చర్చకు రమ్మంటే మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లను పంపిస్తున్నారు. కేసీఆర్ కోరుకున్న రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం సిద్ధం. స్పీకర్‌కు లేఖ రాసి తేదీ ఖరారు చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు