ఓపెన్ఏఐకి చెందిన చాటిజీపీటీ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. ఇమేజ్ జనరేషన్తో పాటు ఇతర సర్వీస్ ల్లోనూ సమస్య తలెత్తింది. ఇందుకు సంబంధించిన పోస్టులను యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనిపై ఓపెన్ఏఐ స్పందించింది. తమ సేవల్లో సమస్య ఏర్పడిందని, పరిష్కారానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని పేర్కొంది. అయితే, దీనిపై తమ ఇంజినీరింగ్ బృందం పనిచేస్తోందని, ఇప్పటికే చాటే జీపీటీ సేవలు పునురుద్ధరించినట్లు పేర్కొంది. ఇతర సర్వీస్లను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది.