పిల్లలు, టీనేజర్ల సోషల్ మీడియా వినియోగంపై అమెరికాలో మెటా మరో పెద్ద న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటోంది. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల రూపకల్పన పిల్లలను ఎక్కువసేపు యాప్‌లలోనే ఉంచేలా ఉందని ఆరోపిస్తూ నాలుగు అమెరికా రాష్ట్రాలు భారీ జరిమానా కోరాయి. ఈ డిమాండ్ మొత్తం 1.4 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండటంతో కేసు ప్రపంచ టెక్ రంగం దృష్టిని ఆకర్షించింది. కాలిఫోర్నియా, కొలరాడో, కెంటుకీ, న్యూజెర్సీ రాష్ట్రాలు దాఖలు చేసిన వ్యాజ్యంలో ఎండ్లెస్ ఫీడ్, నోటిఫికేషన్లు, లైక్‌లు, పిల్లల దృష్టిని నిలిపివేయడానికి ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారని రాష్ట్రాలు వాదిస్తున్నాయి.