ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ను గుర్తించారు. కడప జిల్లాకు చెందిన నాలుగు నమూనాలను పూణే వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించగా ఈ వేరియంట్ నిర్ధారణ అయింది. అయితే ఈ వేరియంట్ ఇతర ఒమిక్రాన్ ఉపవంశాల కంటే ప్రమాదకరమనే ఆధారాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని అధికారులు తెలిపారు.