విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఉపా కేసు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రావణ్ కు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్ పై నెల్లూరు జైల్లో ఉన్న రావణ్ ను ఇవాళ గన్నవరం కోర్టు న్యాయమూర్తి ముందు పోలీసులు వర్చువల్ గా హాజరుపర్చారు. పోలీసులు రావణ్ రిమాండ్ పొడిగింపు కోరగా.. రావణ్ న్యాయవాదులు బెయిల్ ఇవ్వాలని కోరారు.
అయితే కోర్టు మాత్రం రిమాండ్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.