రాష్ట్రంలో అక్టోబర్ 2 నాటికి చెత్తలేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుంటూరు, నెల్లూరు నగరాల్లో చెత్త సేకరణకు ఉపయోగించే.. ఎలక్ట్రిక్ ఆటోలను వర్చువల్గా ప్రారంభించారు. బాగా పని చేసిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. ఇంట్లో ఎవరికి వారే.. తడి, పొడి చెత్తను వేరు చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.